సులభమా యిందరికి జూడ సులభముగాక కలిగె మీకృప నాకు గమలరమణా
సతతదయాచారసంపన్నుడై మఱికదా అతిశయవైష్ణవాన కరుహుడౌట
వ్రతోపవాసతీర్థవరసిద్దుడై కదా మితిమీరి నరహరి మీదాసుడౌట
సకలయజ్ఞఫలము సత్యము ఫలముగదా ప్రకటించి విష్ణునామపాఠకుడౌట
అకలంకమతితోడ నాజన్మశుద్ధుడై కదా అకుటిలమగుమీచక్రాంకితుడౌట
కెరలి సదాచార్యకృపగలిగినగదా నిరతి శ్రీవేంకటేశ నిన్ను గనుట
మరిగి మీపై భక్తి మఱి ముదిరినగదా అరయ మీకే శరణాగతుడౌట
No comments:
Post a Comment