సులభమా మనుజులకు హరిభక్తి వలనొంది మరికదా వైష్ణవుడౌట
కొదలేని తపములు కోటాన గోటులు నదన నాచరించి యటమీద
పదిలమైన కర్మల బంధములన్నియు వదిలించుకొని కదా వైష్ణవుడౌట
తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య అనఘుడై చేసిన యటమీదట
జననములన్నిట జనియించి పరమ పావనుడై మరికద వైష్ణవుడౌట
తిరిగి తిరిగి పెక్కుతీర్థములన్నియు నరలేక సెవించినమీదట
తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ వరదుని కృపగద వైష్ణవుడౌట
No comments:
Post a Comment