శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 8, 2010

పొలయలుక

పొలయలుక నిద్దురలు భోగించ దొరకొంటి వలరివడి మేల్కొనవె అఖిలేశ్వర

తరుణిమైనపుడె పరితాప సూర్యుడు వొడిచె వరుస జెలి కన్నుగలువలు మొగిచెను
మరుని సాయకపు తామరలు వడి వికసించె కరుణతో మేల్కొనవె కమలేశ్వరా

కాంత నిట్టూర్పులను గాలియును నగ్నియును వంత చెమటల వాన వరుణుండును
వింతలుగ నిన్ను సేవింతుమని యున్నారు పంతమున మేల్కొనవె పరమేశ్వరా

మోలుత పెనుదురుమనెడి మేఘ మండలములో నలుగడల జెలగె సుమ వస పంక్తులు
కులికి పూవుల వాన కురియంగ నున్నదిదే చలముడిగి మేల్కొనవె సర్వేశ్వరా

కదిసి పులకల సృష్టి కడలేక పొడమించు మదనుడను మానసక మలభవుడును
ముదితకోపపుహరుడు మొనసియున్నారిదే నిదుర మేల్కొనవె జలనిధి శయనుడా

ఒడికముగ జెలిలోన నుదయరాగము వొడమె వెడలె నవె పలుకు గోవిలరవములు  
పడతి గూడితివి రతి పరవశంబికనైన కడగి మేల్కొనవె వేంకటరమణుడ         

No comments:

Post a Comment