శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సకలబలంబులు

సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు

పొందుగ జక్రాంకితమే బుజబల మిదే నాకు అందినహరి నీచింతే ఆత్మబలము నాకు
సందడి బేరుబలము కేశవనామము నాకు యిందును నందును భవభయ మిక లేదిదే నాకు

అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు
రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు

కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు
తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు

No comments:

Post a Comment