శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సకలభూతదయ

సకలభూతదయ చాలగ గలుగుట ప్రకటించి దేహసంభవమైనఫలము

తలకొన్న ఫలవాంఛ దిగులకుండగ జిత్త మలవరించుట కర్మియైనఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి గలుగుట హరికృపగలిగినఫలము

ఎప్పుడు దిరువేంకటేశు సేవకుడౌట తప్పక జీవుడు దానైన ఫలము
కప్పినసౌఖ్యదుఃఖమ్ములు సమముగా నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము

No comments:

Post a Comment