శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సకలలోక నాధుడు

సకలలోక నాధుడు జనార్థునుడితడు శుకయొగి వంద్యుని సుగ్నానమెంత

మరుని తండ్రికిని మరి చక్కదనమెంత సిరి మగని భాగ్యము చెప్పనెంత
పురుషొత్తము ఘనత పొగడగ నికనెంత అరిమ జలధి సాయి గంభీరమెంత

అమిత వరదునకు ఔదర్యగుణమెంత విమత దురవైరి విక్రమమెంత
మమతల అలమెలుమంగాపతి సొబగెంత అమర శ్రీవేంకటేశు ఆధిక్యమెంత

No comments:

Post a Comment