శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సకలశాంతికరము

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ

మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన నినుదలచినంతనే నీఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును

చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలజెవుల వినగా నంటిన పాపము నీతితో నీ కథ వింటే నిమిషానబాయును

కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా అయమైన నీ శరణాగతిచే నణగు

No comments:

Post a Comment