సకలశాస్త్రసంపన్నుడట చిత్తమొకటికిని జొరదు విధియోగమౌగాదో
దొరతనంబట కలిమి దోడుగాదట మంచి తరుణులట మోహమట దైన్యంబట
విరహమట దారిద్ర్యవివశుడౌనట చూడ నరయ నిది కర్మఫలమౌనో కాదో
రాజసన్మానమట రవణహీనత్వమట తేజమట నలువంక దిరిపెంబట
వాజివాహనములట వాడిలేదట తొంటి పూజఫలమిది వెలితిభోగమౌగాదో
యిలయెల్ల నేలునట ఇంటలేదట మిగుల బలిమిగలదట సడా పరిభవమట
చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని గొలువనేరనివెనక గొరతలౌగాదో
No comments:
Post a Comment