శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సకలసందేహమై

సకలసందేహమై జరుగుచున్నది యొకటి ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని

వసుదేవజఠరమనువననిధికి జంద్రుడై అసమానగతి బొడమినా డితడు
వసుధ జంద్రుడు నీలవర్ణు డేటికినాయ కసరెత్తి నునుగందు గలయగొనుబోలు

ఇనవంశమున లోకహితకల్పభూజమై అనఘుడై జనియించినా డితడు
నను పై నసురతరువు నల్లనేటికినాయ పెనుగొమ్మలో చేగ పెరిగిరాబోలు

తిరువేంకటాద్రిపై దెలియ జింతామణై అరిదివలె బొడచూపినా డితడు
గరిమె నది యిపుడు చీకటివర్ణమేలాయ హరినీలమణులప్రభ లలమికొనబోలు

No comments:

Post a Comment