శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సగము మానిసి

సగము మానిసి రూపు సగము మెగము రూపు అగణిత ప్రతాపుడు అహోబలేశుడు

గద్దెమీద గూచున్నాడు కంబములో బుట్టినాడు కొద్దిమీర గడునవ్వుకొంటానున్నాడు
వొద్దనె శ్రీసతిచన్నులొరయచు నున్నవాడు అద్దివో చూడరమ్మ అహోబలేశుడు

పెనుమీసాలవాడు పెదపెదగోళ్ళవాడు ఘనునిగా ప్రహ్లాదుని గాచుకున్నాడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు అనుపమతేజుడమ్మ అహోబలేశుడు

వేవేలు చేతులవాడు వెన్నెలచాయలవాడు భావించి కొల్చినవారి పాలిటివాడు
శ్రీవేంకటగిరిమీద జేరి భవనాశిదండ నావల నీవల మించె నహోబలేశుడు

No comments:

Post a Comment