శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సడిబెట్టె గటకటా

సడిబెట్టె గటకటా సంసారము చూడ జలధిలోపలియీత సంసారము

జమునోరిలో బ్రదుకు సంసారము చూడ చమురుదీసినదివ్వె సంసారము
సమయించుబెనుదెవులు సంసారము చూడ సమరంబులో నునికి సంసారము

సందిగట్టినతాడు సంసారము చూడ సందికంతలతోవ సంసారము
చందురునిజీవనము సంసారము చూడ చంద మేవలెనుండు సంసారము

చలువలోపలివేడి సంసారము చూడ జలపూతబంగారు సంసారము
యిలలోన దిరువేంకటేశ నీదాసులకు చలువలకు గడుచలువ సంసారము

No comments:

Post a Comment