వేవేలు బంధములు విడువ ముడువబట్టె దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా
పారీ ముందటిభవపాశములు తీరీ దొల్లిటితిత్తిలో పుణ్యము
వూరీ గోరిక లొకటొకటే యేరీతి సుజ్ఞాన మెరిగేనయ్యా
పట్టీ నాకొంగు పంచేంద్రియములు తొట్టీ బాపము తోడుతనే
పెట్టీ భ్రమల బెరిగి నీమాయలు అట్టే మోక్ష మెన్నడందేమయ్యా
విందై యిహము వెనకకు దీసీ అందీ వైరాగ్య మరచేతికి
కందువ శ్రీవేంకటపతి యీ రెండు బొందించితి వేది భోగింతునయ్యా
No comments:
Post a Comment