శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేవేలచందాల

వేవేలచందాల వాడు విఠలేశుడు భావించ నలవిగాని పరమాత్ముడితడు

సతతము రుక్మిణీ సత్యభామల నడుమ రతికెక్కిన సింగార రాయడు ఇతడు
చతురత సనకాది సంయమీంద్రుల మతి అతిశయిల్లేటి పరమానందమితడు

దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది తావు కొన్నయట్టి యాధార మీతడు
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు

వరముతో యశోద వసుదేవాదులకు పరగిన కన్నుల పండుగీతడు
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది నిరతి దాసుల పాలి నిధాన మితడు

No comments:

Post a Comment