వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని గోలతనమిపుడేలే కొంగుపట్టీ నతడు
తమకించి నపుడే తతియాయ రతులకు సుముఖుడైనపుడే సూటి మాటకు
చెమరించినపుడే చేతలకెల్లా లోను కొమరె వేల లోగేవే కొంగువట్టీ నతడు
అంట జూచినపుడే అదనట్టే నవ్వులకు వెంట వచ్చినపుడే విందుమోవికి
నంటు సేసుకున్నప్పుడే నయము కోరికలకు దంటవు యేల కొంకేవే దక్కగొనీ నతడు
ఆయములంటినప్పుడే అనువు నీ పంతాలకు చాయ సేసుకొన్నపుడే చవి కౌగిలి
యీయెడ నలమేల్మంగ ఇదిగో శ్రీ వేంకటేశు నోయమ్మ కూడితివి నీ వొడి వట్టెనతడు
No comments:
Post a Comment