శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేఱొకచోట

వేఱొకచోట లేడు వీడివో హరి వీఱిడియై చేరువనే వీడివో హరి

మునుకొని వెదకితే ముక్కుమార్పుగాలికొన వెనవెనక దిరిగీ వీడివో హరి
పెనగి వెదకబోతే పెడచెవులమంత్రమై వినవచ్చీ మాటలలో వీడివో హరి

సోదించి వెదకితేను చూపులకొనలనే వీదుల నెందు చూచినా వీడివో హరి
ఆదిగొని వెదకితే నట్టే నాలికకొన వేదమై నిలిచినాడు వీడివో హరి

తెలిసి వెదకబోతే దేహపుటంతరాత్మయై వెలుపలా లోపలాను వీడివో హరి
చెలగి శ్రీవేంకటాద్రి చేకొని మమ్ము రక్షించ వెలసె నిందరు జూడ వీడివో హరి

No comments:

Post a Comment