వేదవేద్యులు వెదకేటిమందు ఆదినంత్యము లేని ఆ మందు
ఆడవి మందులు గషాయములు నెల్లవారు కడగానక కొనగాను
తొడిబడ నొకమందు దొరకె మాకు భువినడియాలమైనట్టి ఆ మందు
లలిత రసములు దైలములు నెల్లవారు కలకాలము గొనగాను
చెలువైన దొకమందు చేరె మాకు భువి నలవి మీరినయట్టి ఆ మందు
కదిసిన జన్మరోగముల నెల్లవారు కదలలేక వుండగాను
అదన శ్రీ తిరువెంకటాద్రి మీది మందు అదివొ మాగురుడిచ్చె నా మందు
No comments:
Post a Comment