శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేదములే నీ

వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ

ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన నారాయణ రమాథినాయక నగధర నరసింహ
నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు ఈరీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ

గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ

దాసపరికర సులభ తపన చంద్రనేత్ర వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ

No comments:

Post a Comment