శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేదన బొరలే

వేదన బొరలే వెరవేలా యీదయ విధి దనకీయదా

తత్తరపాట్ల తనువికారముల జిత్తము దెంచేచెలువేలా
బత్తితో దాచిన పరధనంబుగొని సత్తయు వుండుట చాలదా

యెక్కువతమకపుటింతుల బొందక వక్కుచువాడే వయసేలా
మొక్కుచు దాచిన మూలధనము గన నెక్కువ దైవంబియ్యదా

సేతల బొరలెడి చిక్కుల గెరలెడి రోతల యీనేరుపులేలా
బాతిగ వేంకటపతిరతి జిత్తపు టూతల గోరిక లూనవా

No comments:

Post a Comment