వేదం బెవ్వని వెదకెడివి ఆదేవుని గొనియాడుడీ
అలరిన చైతన్యాత్మకు డెవ్వడు కలడెవ్వ డెచట గలడనిన
తలతు రెవ్వనిని దనువియోగదశ యిల నాతని భజియించుడీ
కడగి సకలరక్షకు డిందెవ్వడు వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని దడవిన ఘనుడాతని గనుడు
కదసి సకలలోకంబుల వారలు యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడీ
No comments:
Post a Comment