శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వెర్రివాడు వెర్రిగాడు

వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము లేక విర్రవీగేయహంకారి వెర్రివాడు

నాలుకపై శ్రీహరినామమిట్టే వుండుగాను జోలితో మరచిననీచుడే వెర్రివాడు
అలరియీజగమెల్లా హరిరూపై వుండగాను వాలి తలపోయనివాడు వెర్రివాడు

కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే కోరివేరె కలడనేకుమతి వెర్రివాడు
చేరి తనయాత్మలోన శ్రీరమణుడుండగాను దూరమై తిరుగువాడే దొడ్డ వెర్రివాడు

సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండగా సారె గర్మములంటేడి జడుడు వెర్రివాడు
చేరువ నాతనిముద్ర చెల్లుబడి నుండగా మోరతోపైవున్నవాడే ముందు వెర్రివాడు

No comments:

Post a Comment