వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి కుఱచబుద్ధుల నెట్టు గూడుదునయ్య
చ|| దేహమిచ్చినవాని దివిరి చంపెడువాడు | ద్రోహిగాక నేడు దొరయట |
ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే- | సాహసమున నెట్టు చాలుదునయ్య ||
చ|| తోడబుట్టినవాని తొడరి చంపెడువాడు | చూడ దుష్టుడుగాక సుకృతియట |
పాడైనయిటువంటి పాపబుద్ధులు సేసి | నీడనిలువ నెట్టు నేరుతునయ్య ||
కొడుకు నున్నతమతి గోరి చంపెడువాడు కడుబాతకుడుగాక ఘనుడట
కడలేనియిటువంటి కలుషవ్రిత్తికి నాత్మ వొడబరపగ నెట్లోపుదునయ్య
తల్లి జంపెడువాడు తలప దుష్టుడుగాక యెల్లవారలకెల్ల నెక్కుడట
కల్లరియనుచు లోకము రోయుపని యిది చెల్లబో నేనేమి సేయుదునయ్య
యింటివేలుపు వేంకటేశ్వరు దనవెంట వెంట దిప్పెడువాడు విభుడట
దంటనై యాతనిదాసానుదాసుడై వొంటినుండెద నేమి నొల్లనోయయ్య
No comments:
Post a Comment