శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వెఱవకు మనసా

వెఱవకు మనసా విష్ణుని యభయము నెఱవుగ నెదుటనే నిలచినది

శ్రీపతి కరుణ జీవ రాసులకు దాపును దండై దగిలినది
పై పై దేవుని బలు సంకల్పమె చెపట్టి రక్షింప చెలగేది

నలినోదరు నిజ నామాంకితమే యిలపై దాసుల నేలేది
కలి భంజను శంఖ చక్ర లాంఛన మలవడి శుభముల నందించేది

 శ్రీవేంకటపతి చేసిన చేతలె వేవేల విధుల వెలసేది
భూవిభుడితడు పూచిన మహిమలె కైవసమై మము గాచేది

No comments:

Post a Comment