శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వెఱ్రి మానుప

వెఱ్రి మానుప రెవ్వరు వేదురు నాయంత విడువదు ముఱ్రబాలలోబుట్టిన ముంచిన వెఱ్రెయ్యా

జగములు రించ బాల్పడి సర్వేశ్వరుడే వుండగ అగణితు డాతనిశక్తి యల్పముగా దెలసి
జిగి నాసంసారరక్షణ సేసెదినంచును దిరిగెద నగుబాత్ల యల్పుడ నే నావెఱ్రిదేయయ్యా

అంతర్యామై దేవుడు అటు సుఖదుఃఖము లొసగగ అంతయు మనుజులు సేసేరని నే దిరిగితిని
బంతినే నావంటి జీవులబడి దిరిగాడుచు గర్మపు దొంతుల జిక్కిననా వెఱ్ఱితోడనే యిదేయయ్యా

శ్రీవేంకటపతి యెదుటనే చేకొని వరము లొసగగ దావతిపడి యితరుల నే దగులుచు నడిగితిని
యీవేళనే నాగురుడును యీదైవము నిటు చూపగతో వెరిగిటు నే బతికితి తొల్లెల్ల వెఱ్ఱినయ్యా

No comments:

Post a Comment