సందడి విడువుము సాసముఖా మందరధరునకు మజ్జనవేళా
అమరాధిపులిడు డాలవట్టములు కమలజ పట్టుము కాళాంజి
జమలి చామరలు చంద్రుడ సూర్యుడ అమర నిడుడు పరమాత్మునకు
అణిమాది సిరులనలరెడు శేషుడ మణిపాదుకలిడు మతి చెలగా
ప్రణుతింపు కదిసి భారతీరమణ గుణాధిపు మరుగురు బలుమరును
వేదఘోషణము విడువక సేయుడు ఆదిమునులు నిత్యాధికులు
శ్రీదేవుండగు శ్రీవేంకటపతి ఆదరమున సిరు లందీ వాడె
No comments:
Post a Comment