శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

సంతలే చొచ్చితిగాని

సంతలే చొచ్చితిగాని సరకు గాననైతి యింతట శ్రీహరి నీవే యిట దయజూడవే

కాంతచనుగొండలు కడకునెక్కితిగాని యెంతైనా మోక్షపుమెట్లు యెక్కలేనైతి
అంతట జవ్వనమనే అడవి చొచ్చితిగాని సంతత హరిభక్తనే సంజీవి గాననైతి

తెగి సంసారజలధి దిరుగలాడితిగాని అగడైవైరాగ్యరత్నమది దేనైతి
పొగరుజన్మాలరణభూములు చొచ్చితిగాని పగటుగామాదులపగ సాధించనైతి

తనువనియెడికల్పతరువు యెక్కితిగాని కొనవిజ్ఞానఫలము గోయనైతి
ఘనుడశ్రీవేంకటేశ కమ్మర నీకృపచేత దనిసి యేవిధులను దట్టుపడనైతి

No comments:

Post a Comment