సంతగాడ విక మమ్ము బాయకువయ్యా బంతి చెట్టుకొని మమ్ము బాలార్చవయ్యా
జవ్వనపు వారమో సముకపు వారమో యెవ్వర మేమన్నా నెగ్గులెంచకువయ్యా
నవ్వు నవ్వే వారమో ననుపైన వారమో తవ్విన మోవి రసాల దప్పి దేర్చవయ్యా
సేవచేసే వారమో చిత్తములో వారమో కావరించినా మమ్ముగై కొనవయ్యా
పూవువంటివారమో భోగించేవారమో వేవేలు మన్ననల వెలయించవయ్యా
కడుమేన వారమో కప్రపుబడివారమో యెడయక ఇట్టె వీడేలియ్యవయ్య
కడగి శ్రీ వేంకటేశ కలసిన నీ వారమో జడియక యిట్లానే చనవియ్యవయ్యా
No comments:
Post a Comment