షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి
అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ నిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే
వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము
అమృతమథనునకు నదివో నైవేద్యము రవిజంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో
Download
No comments:
Post a Comment