శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శ్రీహరిసేసినచిహ్నలివి

శ్రీహరిసేసినచిహ్నలివి యీ మోహము విడుచుట మోక్షమది

మలినంబేది మణుగననేది కలుషపుమలముల కాయమిది
కలిగినదేది కడులేందేది చలనపుమాయల జన్మమిది

తనిసినదేది తనియనిదేది దినదినమాకలి దీరదిది
కొనయిందేది గురిమొదలేది పనిగొనుకర్మపు బంధమిది 

నిండినదేది నిండనిదేది కొండలపొడపుల కోరికది
అండనే శ్రీ వేంకటాధిపు శరణని వుండుటె యిహపర యోగమది

No comments:

Post a Comment