శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో
దేవకీ సుత దేవ వామన గోవిందా గోప గోపీనాథా
గోవర్ధనధర గోకులపాలక దేవేశాధిక తే నమో నమో
సామాజావన శార్ణపాణి వామనా కృష్ణ వాసుదేవ
రామనామ నారాయణ విష్ణో దామోదర శ్రీధర నమో నమో
పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి
చిరంతన అచ్యుత శ్రీవేంకటేశ్వర నరమృగ తే నమో నమో
No comments:
Post a Comment