సేవింతురే యితని జెలగి పరులిట్లనే కావించి మమ్ము నెక్కడిదైవ మితడు
పాఅలచవి యితడెరుగు పాల బవళింప గోపాలుడని నే మితని భజియించగా
పాలుపడి తల్లిచనుబాలు సహితంబు నేకాలమును బాపె నెక్కడిదైవ మితడు
పుట్టింప దానె మరి పురుషోత్తముడు మంచి పుట్టు వొసగిననుచు బూజించగా
పట్టుకొని మము దెచ్చి బలిమి బుట్టువులెల్ల గట్టిపెట్టించె నెక్కడిదైవ మితడు
కర్మకర్తారుడని కడలేని పుణ్యముల కర్మఫలములు దనకు గైకొలువగా
కర్మగతి దెచ్చి వేంకటవిభుడు మావుభయ కర్మముల జెరిచె నెక్కడిదైవ మితడు
No comments:
Post a Comment