శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సేవించరో జనులాల

సేవించరో జనులాల చేతులెత్తిమొక్కరో వావిరి ప్రహ్లదునికి వరదుడు వీడే

జగన్నాథుడు వీడే సర్వరక్షకుడు వీడే నిగమవేద్యుడైన నిత్యుడు వీడే
సుగుణవంతుడు వీడే సర్వకాముడు వీడే నగుమొగము సుగ్రీవనరసింహుడు వీడే

మరుజనకుడు వీడే మహిమాధికుడు వీడే పరగ శ్రీలక్ష్మీపతియు వీడే
సురులకేలిక వీడే శుభమూరుతి వీడే నరసఖుడు సుగ్రీవనరసింహుడు వీడే

భువనాధిపతి వీడే పురుషోత్తముడు వీడే వివిధప్రతాప కోవిదుడు వీడే
ఇవల శ్రీవేంకటాద్రి నిరవైనతడు వీడే సవమూర్తి సుగ్రీవనరసింహుడు వీడే

No comments:

Post a Comment