శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సేయనివా డెవ్వడు

సేయనివా డెవ్వడు చిల్లరదోషాలు యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే

దేవునినమ్మినయట్టిదేహియట యాతనికి యీవల నెంతటిపాప మేమినేసును
భావించి యన్ని నేరాలు పరిహరించు నతడే ఆవటించుసూర్యునికి నందకార మెదురా

పూజింపించుకొనువాడు భువనరక్షకుడట తేజముతో దురితాలు తెంచగలేడా
రాజు సేసినయాణాజ్ఞ రాజుకంటే నెక్కుడా వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు

చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు జాతిలేనుజీవునికి స్వతంత్ర మేది
కాతరపుజన్మానకు గార్య కారణమేది యేతున గరుడనికి ఎదురా పాములు

No comments:

Post a Comment