సాసముఖా నడె సాసముఖా ఆసలసరివారము అవధారు దేవా
మత్తిల్లి జీవుడనేటి మహిమగలుగురాజు చిత్తమనియెడి పెద్దసింహాసనంబెక్కి
బత్తితో బంచేంద్రియపుపరివారము గొలువ చిత్తజుపారుపత్యము సేసీ నిదివో
కడుమదించి నహంకారమనేయేనుగపై యెడనెడ నెక్కి తోలీ నిదె జీవుడనురాజు
బడిబడి గర్మముల పౌజులు దీర్చరో వెడమాయపట్టపువీధుల నేగీని
మించినసంసారమనేమేడలో నేకాంతమున పొంచి జీవుడనేరాజు భోగము భోగించగా
అంచెల శ్రీవేంకటేశుడనేదేవుడు వచ్చి మంచితనమున దానె మన్నించె నదివో
No comments:
Post a Comment