శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, August 5, 2010

శ్రీ వేంకటేశ రాజీవాక్ష

శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే

సురలు గంధర్వ కిన్నరులెల్ల గూడి తంబురుశ్రుతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు నర హరి నిన్ను దలచెదరు హంసస్వరూప

అల చిలుక పలుకులకు నధరబింబము బోలె తెలివి దిక్కుల మిగుల తేట బారే
అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె మలినములు తొలగ నిదో మంచు తెరవిచ్చే

తళుకొత్త నిందిరా తాటంకరైరుచుల వెలిగన్ను తామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చే

No comments:

Post a Comment