ఎక్కువ తక్కువ లేవో యెఱుగ మిద్దరిలోన ఒక్కటై నీవురముపై వున్నదిదె చెలియ
ఆకడ జలధి ద్రచ్చి అమృత మిచ్చితివీవు ఆకెకైతే మోవిజిందీ నమృతము
సైకపు పసిడి చీర సరిగట్టితివి నీవు మేకొని యీమైకైతే మేనెల్ల బసిడే
నిగిడి కౌస్తుభపుమాణికము గట్టితివీవు మగువకైతే నోరెల్లా మాణికములే
బెగడి యాకసమెల్లా పెద్దసేసి కొలచితివి బిగిసే యీచెలికైతే బిడికెడు నడుమే
పలుమారు జలధిలో బవళించితివినీవు కలికి గుణములోనే ఘనజలధి
యెలమి శ్రీ వేంకటేశ యిప్పుడు గూడితిగాని జలజాక్షి యైతే నిన్ను సన్నలనే గలసె
No comments:
Post a Comment