శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, August 7, 2010

ఎంత మాయల

ఎంత మాయల వాడు ఎంచి చూడగ వీడు యింతియీతని రూపము ఎవ్వరెరుగుదురు

తెలుపు జలములలోన తెప్పవలె దేలీనే తలకి పాతాళమున దగియుండేనే
కెలసి తనకన్నులను కెంపువలె జేసీనే నెలత భీకరముగా నేడు నవ్వీనే

ఒరపుగా భూదాన మొకరికి దానడిగీనే తరుణి భూమొక్కరికి ధారవోసినే
మరలి పద్మజుని మనుమనినైన జంపీనే పరచు దనమున వృధాపాలు మాలీనే

పలుమారు తనసిగ్గు బయటబడ జేసేనే కలికితనమునను తామ గడవబాసీనే
వెలది వేంకటగిరి విభుడు నాకౌగిట తొలగక జెమటల దొప్ప దోచీనే

No comments:

Post a Comment