ఎంత పుణ్యమో యిటు మాకుగలిగె చెంతనే నీకృప సిద్ధించబోలు
శ్రీపతి మీకథ చెవులను వింటిమి పాపములణగెను భయముడిగె
తీపుగ తులసీ తీర్థము గొంటిమి శాపము దీరెను సఫలంబాయె
గోవింద మిముగను గొంటిమిప్పుడే పావనమైతిమి బ్రతికితిమి
తావుల మీపాదములకు మ్రొక్కితిమి వేవేలు గలిగిన వేడుకలాయె
శ్రీవేంకటేశ్వర సేవించితి మిము ధావతి దీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీవారమైతిమి నిలిచితి మిపుడు
No comments:
Post a Comment