శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, August 7, 2010

యింతి వుపచార

యింతి వుపచార పూజ యిందే గలిగెనీకు వంతుల జేకొని నీవు వరమియ్యవయ్యా

అంగన నిన్ను జూచుటే ఆవాహనము ఆమెకు అంగవించి నీవు మతి హత్తినదే ఆసనము
సంగతి నీపై చింతే సదా ధ్యానము సుమ్మీ అంగపు జొక్కు జెమట లర్ఘ్యపాద్యాదులు

సరుస గన్నీళ్ళే ఆచమనము జలకము ఆరవిరిప య్యెదయు అంగ వస్త్రము
నిరతి మైకమ్మదావి నీకు నిచ్చిన గంధాలు పరగిన పులకలే పలుపూజలు

దొమ్మివూర్పు విరహాగ్ని ధూపము దీపమునాయె సొమ్ములే మైమెఱుగులు సోలి నీగేవే దండాలు
నమ్మిక శ్రీవేంకటేశ నైవేద్యమాయె మోవి కమ్మర గాగిటి నవ్వే కప్పురపు విడేలు

No comments:

Post a Comment