విచ్చేయరాదా వెలది కడకు నీవు యిచ్చ నాసపడు వారి నెలయించదగునా
నిలిచి నిలిచి నీకు నిక్కి యెదురు చూచీని వలచిన సతి నీవు వచ్చేవంటా
మలసి మలసి నీ మాటలే ఆలకించీని యెలమి నేమని యానతిత్తువో యనుచు
చిమ్మి చిమ్మి నీ యింటికి చేతులే చాచీని తెమ్మల ఆసన్న నీవు తెలుతు వంటా
కుమ్మరించి గుట్టుమాని నవ్వీని పమ్మినీవు తన కొంగు పట్టుదువో యనుచు
పూచి పూచి నీ వద్దికి పొలతుల నంపీని యేచక నీ విప్పుడిట్టె యేలుదు వంటా
రేచి రేచి వలపుల రేసువాయ గూడితివి దాచెను శ్రీ వేంకటేశ తమక మేలనుచు
అన్నమయ్య కీర్తనలు - Annamayya Keertanalu
Wednesday, August 11, 2010
Sunday, August 8, 2010
కరణే కిం
కరణే కిం మాం గృహీతుంతే హరే ఫణిసయ్యా సంభోగ
జలేతవ సంచరణ మిహాధః స్థలే భవనం తవ సతతం
బలేరూప ప్రకటనమతులా చలేస్థానం చలచలరమణా
పదే భువన ప్రామాణ్యం తవ హ్రదే ప్రచురవి హరణమదం
ముదే మునీనాం మోహనం తనుం మదే తవనర్మచ మాం విసృజ
స్మరేవిజయ స్తవ విమలతురగ ఖురే రతి సంకులరచనా
పురే తవ విస్ఫురణం వేంకట గిరే పతేతే ఖేలా ఘటిత

నవ్వు వచ్చీ
నవ్వు వచ్చీ నిన్ను జూచి నాకు నేడు యీ రవ్వలు నీకేచెల్లు రాజసపు దేవుడా
సతికుచముల మోవ సాము జేసినటు వలె సతముగా మోచేవు శంఖ చక్రములు
మతకాన వేడుకొనే మార్గమున నున్నట్లు తతి నభయహస్తము తప్పవు నీవిపుడు
కామిని నలిమిపట్టే గతి యలవాటుగా యేమరపు కటిహస్త మెంతైనా నీవు
నేమాననామెరాక నిక్కిచూచే మతకాన కోమలపు నీకునిల్వు కొలువులే యిపుడు
అంకె వుపరి సురత మలవాటు చెడకుండా ఉంకువ శ్రీసతి మోచే పురమున
అంకి శ్రీవేంకటాద్రి నంది మమ్ముగాచేటి పొంకపు మన్ననల చూపులు జల్లేవిదిగో

నటుమమతావ
నటుమమతావ న్మానస్త్వదీయ నితాంతహితసరణింనమామి
నవదతు భవాన్ జనార్ధన ఘనరతి వివాదవచనం వృధా వృధా
తవమృదు వేదసుధామయవచనై ర్వివిధావశ పదవీం వహామి
న భజతుమాం కరుణానిధే భవ ద్విభవ వినయశ్చ వృధా వృధా
త్రిభువన సుఖకర దివ్యరూపతే ప్రభుతయా పరాభవం భజామి
నచలతు వేంకట నాధమాంవినా విచరణమపితే వృధా వృధా
సుచరిత్రస్త్యం సుభగస్త్యం త్వాం కుచయో పులకాం కురైర్థమామి

పొలయలుక
పొలయలుక నిద్దురలు భోగించ దొరకొంటి వలరివడి మేల్కొనవె అఖిలేశ్వర
తరుణిమైనపుడె పరితాప సూర్యుడు వొడిచె వరుస జెలి కన్నుగలువలు మొగిచెను
మరుని సాయకపు తామరలు వడి వికసించె కరుణతో మేల్కొనవె కమలేశ్వరా
కాంత నిట్టూర్పులను గాలియును నగ్నియును వంత చెమటల వాన వరుణుండును
వింతలుగ నిన్ను సేవింతుమని యున్నారు పంతమున మేల్కొనవె పరమేశ్వరా
మోలుత పెనుదురుమనెడి మేఘ మండలములో నలుగడల జెలగె సుమ వస పంక్తులు
కులికి పూవుల వాన కురియంగ నున్నదిదే చలముడిగి మేల్కొనవె సర్వేశ్వరా
కదిసి పులకల సృష్టి కడలేక పొడమించు మదనుడను మానసక మలభవుడును
ముదితకోపపుహరుడు మొనసియున్నారిదే నిదుర మేల్కొనవె జలనిధి శయనుడా
ఒడికముగ జెలిలోన నుదయరాగము వొడమె వెడలె నవె పలుకు గోవిలరవములు
పడతి గూడితివి రతి పరవశంబికనైన కడగి మేల్కొనవె వేంకటరమణుడ

Subscribe to:
Posts (Atom)