శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వెలయు నీ

వెలయు నీ కల్యాణవేదిగా మతినుండి కలికి జవ్వనపు యాగము సేసెనతడు

మలయు నీ నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి
పొలయు నీ నిట్టూరుపుల విసరుచును వొలుకు జెమటల నాహుంతి వోసెనతడు

కదసి నీనెస్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగ నిండగా
మదిరాక్షి నీ మంచి మానపు బళువు నదనెరిగె వేలిచె నతివ నీకతడు

కాటుక కన్నుల నిన్ను గడునలైంచి బూటకముల చిటిపొటి సిగ్గుల
గాటపు గరుణ వేంకటగిరి విభుడు కోటి హోమము సేసెగూడి నిన్నతడు

No comments:

Post a Comment