వెలయునిన్నియును వృథావృథా తలపున శ్రీహరి దడసినను
ఎడయనిపుణ్యము లెన్నియైనా విడువక సేయుట వృథావృథా
బడిబడి నే శ్రీపతి నాత్మలో దడవక యితరము దడవినను
యెరపులతపముల నెంతైనా విరవిర వీగుట వృథావృథా
హరినచ్యుతు బరమాత్మునిని మరిగి తలచక మరచినను
దైవము నెరగక తమకమున వేవేలైన వృథావృథా
శ్రీవేంకటగిరి చెలువునిని సేవించక మతి జెదరినను
No comments:
Post a Comment