వెలికీ వెళ్ళడు చలికీ వెరవడు వులికీ నులికీ నులికీనయ్యా
రోగియై తారుచుల బాయడు భోగియై రతిపొందల్లడు
వేగిమిగిలినవెడచీకటినీరు తాగీ దాగీ దాగీనయ్యా
తొడికీ దొడకడు వుడికీ నుడకడు కడికీ గసరడు కడుజేరడు
మడికీ గుడికీ మానినమమతల బుడికీ బుడికీ బుడికీనయ్యా
నిండీ నిండడు నెరసీ నెరయడు పండీ బండడు బయలీతలా
అండనె తిరువేంకటాధిపు దలపుచు నుండీ నుండీ నుండీనయ్యా
No comments:
Post a Comment