వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదు వెడమాయా నలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు
జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము వాపులెల్ల నొకవావిగాక మఱి వదలదు ప్రపంచము
భావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబు దైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు
మాటలెల్ల గడమాటలుగాక మాయదు మలినంబు కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము
చాటుదృష్ణ లగచాటునబడక చాలదు సౌఖ్యంబు తేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు
గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు అనువున కనువై అంతయు దాగాక ఆనందము లేదు
ప్రణుతింపగ శ్రీ వేంకటరమణుని బహుళమహిమెల్లా గణనకెక్కగా పురాతనులు మును కడకట్టినమతము
No comments:
Post a Comment