శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేంకటగిరి గోవిందుడా

వేంకటగిరి గోవిందుడా యింకా నొకరో యిద్దరో మీరు

పచ్చలు దాచిన బాహుపురులతో అచ్చపు గరముల అందముతో
అచ్చలు నిచ్చలు నలరుదురిదివో నిచ్చలు నీవో నీవో కానీ

నిలుచుండుటయును నెరి బవళింపుచు నలరుటయును మీరటునిటును
జలజాక్షులు దొడ చరచగ నొరపుల వెలయగ నిద్రో విభవమిదో

తిరువేంకటగిరి దిగువ తిరుపతిని పరమానందపు బహుసిరులు
అరుదుగ బొందుచు అధికము లందుచు ఉరగశయనుడవొ వొడయడవో

No comments:

Post a Comment