శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వెఱ్రివారి దెలుపుటవేవేలు

వెఱ్రివారి దెలుపుటవేవేలు సుకృతము ముఱ్రుబాలమంకే కాని ముందు గాన దైవమా

ఇంతకతొల్లిటిజన్మ మెటువంటిదో యెరగ పొంతనే ఇటమీదటిపుట్టు వెరగ
అంతరాన బెరిగేకాయమే నాకు సుఖమై సంతసాన మురిసేను సంసారమందును

వొడలిలోపలిహేయ మొకైంతా దలచను బడి నెదిటిదేహాలవచ్చి దలచ
సుడిసి పైపచారాలే చూచి సురతసుఖాన పడతుల బొంది పొంది పరిణామించేను

పాపమూలమున వచ్చేబలునరకము లెంచ యేపున బుణ్యపుబుద్ది ఇంచుకా నెంచ
దీపన జంతువును దెచ్చి పాపను జేసితి చేపట్టి నన్ను రక్షించు శ్రీవేంకటేశుడా

No comments:

Post a Comment