సముఖ ఎచ్చరికవో సర్వేశ్వరో అమరె నీకొలువు ప్రహ్లాద వరద
తొడమీద కూచున్నది తొయ్యలి ఇందిరాదేవి బడి చెలులు సోబాన పాడేరు
నడుమ వీణె వాయించీ నారదుడల్ల వాడె అడరి చిత్తగించు ప్రహ్లాద వరదా
గరుడోరగాచు లూడిగములు నీకుజేసేరు ఇరుమేలా కొలిచేరు ఇంద్రాదులు
పరమేష్ఠి ఒకవంక పనులు విన్నవించీ అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా
పొదిగొని మిమ్మునిట్టె పూజించేరు మునులెల్ల కదిసి పాడేరు నిన్ను గంధర్వులు
ముదమున అహోబలమునను శ్రీవేంకటాద్రిని అదె చిత్తగించుము ప్రహ్లాదవరద
No comments:
Post a Comment