సదా సకలము సంపదలే తుద దెలియగవలె దొలగగవలయు
అహర్నిశలు నాపదలే సహించిన నవి సౌఖ్యములే
ఇహముననవి యిందరికిని మహిమ దెలియవలె మానగవలెను
దురంతము లివి దోషములే పరంపర లివి బంధములు
విరసములౌ నరవిభవములౌ సిరులే మరులౌ చిరసుఖ మవును
గతి యలమేల్మంగ నాంచారికి బతియగువేంకటపతి దలచి
గతు లెరుగగవలె రవణము వలెను హిత మెరుగగవలె నిదె తనకు
No comments:
Post a Comment