సత్యభామ సరసపు నగవు నిత్యము హరి మదినే నెలవు
రుకుమిణి దేవికి రూపయవ్వనికి సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమున జెదరిన యలకలు వికచాబ్జ ముఖము వెయి వేలాయె
తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై నడపులమురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని బడలికవాపను పరమంబాయ
అనుదినమునును నీ యలుమేలుమంగ కనుగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి చనువుల సొబగుల సంపదలాయ
No comments:
Post a Comment