శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సతులాల చూడరే

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నాడీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ గూడి యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు


Download

No comments:

Post a Comment