శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సతి నిన్ను

సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడిలో మతిలోన మెచ్చి మెచ్చి మన్నించు రమణుడా

కనుసూటి వలపూ కాంత చూచిన చూపు కొనకెక్కె మరుడదె గురులేసెను
మొనకత్తిసామూ ములువాడి కొనగోరు పెనగి చెక్కులనొత్తి పేరము వారెను

చేసూటి వలపూ చెలి కాగిలించినది బాసతోనే కాయజుడు పందెమాడెను
మూసిదింపు మొరగూ ముంచిన పయ్యదకొంగు ఆసలు నీకుజూపి ఆయాలు రేచెను

మొగసూటివలపూ మోహపు రమణినవ్వు తగవుతో మదనుడు దారగట్టెను
అగపడి శ్రీవేంకటాధిప నీవు గూడితి జగడమింతయు దీరిచనవు చేకొనెను

No comments:

Post a Comment